ట్యూషన్ కి వెళ్లి వస్తూ పదో తరగతి విద్యార్థి మృతి..
ట్యూషన్ కి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పీఎస్ కాచివాని సింగారంలో జరిగింది.
![ట్యూషన్ కి వెళ్లి వస్తూ పదో తరగతి విద్యార్థి మృతి.. ట్యూషన్ కి వెళ్లి వస్తూ పదో తరగతి విద్యార్థి మృతి..](https://www.dishadaily.com/h-upload/2025/01/28/1500x900_415641-web-image.webp)
దిశ, మేడిపల్లి : ట్యూషన్ కి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పీఎస్ కాచివాని సింగారంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాచివాని సింగరానికి చెందిన పదో తరగతి విద్యార్థి తేజస్ చౌదరి (14) పర్వతాపూర్ సమీపంలో టూ వీలర్ పై ట్యూషన్ కి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలోనే కాచివాని సింగారంలో తేజస్ ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. విద్యార్థి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని అన్నారు.