ఏడేళ్ల బాలికపై అత్యాచారం...?

కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మానవ మృగం.. పసిపాపపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Update: 2023-03-09 07:46 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మానవ మృగం.. పసిపాపపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అదే గ్రామానికి చెందిన మారుపల్లి బాలకృష్ణ అనే మృగాడు.. అదే గ్రామానికి చెందిన అభం శుభం తెలియని 7 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్టు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే బాలకృష్ణ అత్యాచారానికి పాల్పడ్డాడా.. లేక కిడ్నాప్ మాత్రమే చేశాడా అనే కోణంలో దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటి నుంచి పాపను బాలకృష్ణ తీసుకువెళ్లాడని, రాత్రి 10 గంటలైనా కూడా బాలిక ఇంటికి రాకపోవడంతో బాలికను బాలకృష్ణ తీసుకెళ్లి అత్యాచారం చేసి ఉంటాడని కుటుంబీకులు చెబుతున్నారు. గ్రామస్తులు నిందితున్ని విషయాన్ని అడగగా పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్‌లో బాలిక చికిత్స పొందుతుంది. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలికను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News