అప్పులబాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధ తీర్చలేక ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Update: 2024-12-27 14:11 GMT

దిశ, తిరుమలగిరి : అప్పుల బాధ తీర్చలేక ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బోయినపల్లి ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా మహబూబాబాద్ మండలం కదిరాపాడు గ్రామానికి చెందిన ముదావత్ నర్సింహ(41)తన భార్య శ్యామలమ్మ తో ఓల్డ్ బోయినపల్లిలో నివాసం ఉంటున్నారు.

    స్థానిక అరేబియన్ బేకరీ వద్ద కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తూ జీవిస్తుండే వాడని, గత కొన్ని రోజుల క్రితం స్థానిక బ్యాంకులో దాదాపు 4 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకున్నాడని తెలిపారు. బ్యాంకులో లోను చెల్లించలేకపోవడంతో బ్యాంకు అధికారుల నుండి ఒత్తిళ్లు తీవ్రం కావడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 


Similar News