జిల్లా కోర్టు ఆవరణలో వ్యక్తి హల్​చల్​

కరీంనగర్ జిల్లా కోర్టులోకి శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి అక్రమంగా ప్రవేశించి హల్చల్​ సృష్టించాడు.

Update: 2024-11-23 14:00 GMT

దిశ, కరీంనగర్ లీగల్ : కరీంనగర్ జిల్లా కోర్టులోకి శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి అక్రమంగా ప్రవేశించి హల్చల్​ సృష్టించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కోర్టు వెనుక భాగంలో తాత్కాలిక దారి కోసం తీసిన ప్రాంతం నుండి ఆగంతకుడు కోర్టులోకి ప్రవేశించాడు. అనంతరం ఫ్యామిలీ కోర్టు సమీపంలోకి వచ్చి అక్కడ ఉన్న పలు వేస్ట్ పేపర్లను టాయిలెట్లోకి తీసుకెళ్లి కాల్చేశాడు. పక్కనే ఉన్న ఉద్యోగుల బయోమెట్రిక్ యంత్రాన్ని కూడా పగలగొట్టాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ విషయమై సెంట్రల్ నజారత్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   


Similar News