బైక్​ అదుపు తప్పి వ్యక్తి మృతి..

బైక్​ అదుపుతప్పి హైవే రోడ్డుపై కిందపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పరిగి పరిధిలో జరిగింది.

Update: 2023-05-14 14:44 GMT

దిశ, పరిగి: బైక్​ అదుపుతప్పి హైవే రోడ్డుపై కిందపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన  పరిగి పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పరిగి మున్సిపల్​ పరిధిలోని 5వ వార్డుకు పద్మావతి కాలనీకి చెందిన నర్సింహులు గౌడ్​(50) ఆదివారం సాయంత్రం బైక్​ పై కోడంగల్​ వైపు నుంచి పరిగి వైపునకు వస్తున్నాడు. ప్రమాదవశాత్తు బైక్​ అదుపు తప్పి కిందపడ్డాడు. దీంతో హైవే రోడ్డుపై ఉన్న డివైడర్​ కు తల తగిలి తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హెల్మెట్​ ధరించి ఉంటే నర్సింహులు గౌడ్​ చనిపోయే వాడు కాదని పరిగి ఎస్​ఐ పి.విఠల్​ రెడ్డి తెలిపారు.

ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్​ ధరించాలని సూచించారు. నర్సింహులు గౌడ్​ మృతి చెందిన విషయం తెలుసుకున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ పవర్,కౌన్సిలర్ మల్లేష్,ఎక్స్ సర్వీస్ మెన్ లింగమయ్య, రహీం పటేల్, కుమార్ గౌడ్, ఇబ్రహీం,జాంగిర్, తదితరులు నర్సింహులు కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్​ఐ. విఠల్​ రెడ్డి తెలిపారు. 

Tags:    

Similar News