కత్తితో పొడుచుకొని వ్యక్తి ఆత్మహత్య
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
దిశ,పెగడపల్లి : అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రవి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బతికేపల్లి గ్రామానికి చెందిన పోచంపల్లి మల్లయ్య (56) గత రెండు సంవత్సరాలుగా లివర్, గుండె, కిడ్నీకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాడు. ఆరు నెలల క్రితం లివర్ డ్యామేజ్ అయిందని వైద్యులు తెలపగా చికిత్స నిమిత్తం ఎన్ని ఆసుపత్రులు తిరిగినా వ్యాధి నయంకాకపోవడంతో మనస్థాపం చెంది తన ఇంట్లో కత్తితో గొంతులో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవి కిరణ్ తెలిపారు.