కొత్త వ్యాపారంలోకి సచిన్ టెండూల్కర్

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పలు బ్రాండ్లకు ప్రచార కర్తగా ఉన్న విషయం తెలిసిందే. క్రికెట్ ఆడే సమయంలోనే సచిన్ రెస్టారెంట్ బిజినెస్‌తో పాటు పలు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ఫుట్‌బాల్, కబడ్డీ లీగ్స్‌లో కూడా భాగస్వామిగా ఉన్నాడు. ఇక తాజాగా మరో వ్యాపార సంస్థలో సచిన్ పెట్టుబడులు పెట్టాడు. సెకెండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేసే స్పిన్నీ అనే స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టాడు. ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ […]

Update: 2021-12-14 10:34 GMT

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పలు బ్రాండ్లకు ప్రచార కర్తగా ఉన్న విషయం తెలిసిందే. క్రికెట్ ఆడే సమయంలోనే సచిన్ రెస్టారెంట్ బిజినెస్‌తో పాటు పలు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ఫుట్‌బాల్, కబడ్డీ లీగ్స్‌లో కూడా భాగస్వామిగా ఉన్నాడు. ఇక తాజాగా మరో వ్యాపార సంస్థలో సచిన్ పెట్టుబడులు పెట్టాడు. సెకెండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేసే స్పిన్నీ అనే స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టాడు. ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ పద్ధతిలో యూజుడ్ కార్ల వ్యాపారం చేసే స్పిన్నీ సంస్థ అత్యంత వేగంగా వృద్ది చెందుతున్నది.

‘మన దేశంలో యువతకు ఎన్నో ఆశలు, ఆశయాలు ఉన్నాయి. ఎంతో మంది యువ వ్యాపారవేత్తలు తమ ఆశలను నెరవేర్చుకోవడానికి నిరంతరం కష్టపడుతున్నారు. అలాంటి ఒక యువ బృందం ఏర్పాటు చేసిందే స్పిన్నీ అనే ప్లాట్‌ఫామ్. ఇది ఎంతో పారదర్శకంగా అందరికీ సేవలు అందిస్తున్నది. అలాంటి సంస్థలో నేను కూడా భాగస్వామినయ్యాను’ అని సచిన్ పేర్కొన్నాడు. ఇక సంస్థ ఫౌండర్ అండ్ సీఈవో నీరజ్ సింగ్ మాట్లాడుతూ మా జట్టుకు సచిన్ కెప్టెన్. ఆయన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాను అని చెప్పాడు. కాగా, సచిన్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.

Tags:    

Similar News