చివరి రోజు క్రెడాయ్ షో అదుర్స్.. పోటెత్తిన సందర్శకులు

దిశ, శేరిలింగంపల్లి: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( క్రెడాయ్ ) 10వ ఎడిషన్ ప్రాపర్టీ షో ఉత్సాహంగా ముగిసింది. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గతమూడు రోజులుగా సాగిన ఈ షోకు సందర్శకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. వేలాదిగా తరలివచ్చిన సందర్శకులు నగరంలో విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం, అందులో ఉన్న ప్రతికూలతలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఆరాతీశారు. అలాగే హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తున్న నూతన వెంచర్లు, […]

Update: 2021-08-15 09:34 GMT

దిశ, శేరిలింగంపల్లి: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( క్రెడాయ్ ) 10వ ఎడిషన్ ప్రాపర్టీ షో ఉత్సాహంగా ముగిసింది. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గతమూడు రోజులుగా సాగిన ఈ షోకు సందర్శకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. వేలాదిగా తరలివచ్చిన సందర్శకులు నగరంలో విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం, అందులో ఉన్న ప్రతికూలతలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఆరాతీశారు. అలాగే హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తున్న నూతన వెంచర్లు, విల్లాలు, ప్లాట్స్ వివరాలను సవివరంగా తెలుసుకున్నారు. తమకు నచ్చిన చోట ప్లాట్స్, విల్లాస్ కొనేందుకు ఆసక్తి చూపారు. అలాగే స్పాట్ బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు ఆయా రియల్ ఎస్టేట్ సంస్థలు మంచి ఆఫర్స్ కూడా ప్రకటించడంతో 10వ ఎడిషన్‌లో చాలా సంస్థలు జోరుగా అమ్మకాలు సాగించాయి. పెద్ద ఎత్తున బుకింగ్స్ కూడా జరగడంతో రియల్ ఎస్టేట్ సంస్థలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కొవిడ్ తీవ్రత ఇంకా ఉందన్న వార్తల నేపథ్యంలోనూ వినియోగదారులు కొనుగోళ్లకు ఆసక్తి కనబర్చడం నూతన ప్రాజెక్టులపై ఆశలు చిగురింప చేస్తున్నాయని, కొత్త వెంచర్ల ఏర్పాటుకు ఈ క్రెడాయ్ షో ఎంతో ఉపకరిస్తుందని, ఇదే ఉత్సాహం రానున్న రోజుల్లోనూ కొనసాగాలని ఆకాంక్షించారు.

క్రెడాయ్ ది బెస్ట్..

కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( క్రెడాయ్ ) 10వ ఎడిషన్ ప్రాపర్టీ షోలో స్టాల్స్ ఏర్పాటు చేసిన రియల్టర్లకు క్రెడాయ్ టీమ్ అభినందనలు తెలిపింది. హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి ఇతర టీమ్ సభ్యులు స్టాల్స్ నిర్వాహకులకు, క్రెడాయ్ షోనూ సక్సెస్ చేసిన సందర్శకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సందర్శకుడికి కారు గిఫ్ట్..

క్రెడాయ్ షో ఎలా ఉంటుంది. అందులో ఏమేమి ఉంటాయో తెలుసుకుందామని సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు వచ్చి, తన పేరు నమోదు చేసుకుని గిఫ్ట్ డ్రాప్ బాక్స్‌లో వేసిన ఓ సందర్శకుడికి లక్కీ లాటరీ తగిలింది. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డిని కారు వరించింది. డ్రా తీసిన క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణ రావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి చివరిరోజు తీసిన డ్రాలో శ్రీనివాస్ రెడ్డికి కారు గెలుచుకున్నట్లు ప్రకటించారు.

క్రెడాయ్ టీమ్‌కు మెమెంటోస్..

కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( క్రెడాయ్ ) 10వ ఎడిషన్ ప్రాపర్టీ షోను విజయవంతం చేసిన వారికి క్రెడాయ్ టీమ్ మెమెంటోలు ప్రధానం చేసింది. బెస్ట్ స్టాల్స్, బెస్ట్ థీమ్స్, ఇలా అనేక అంశాల్లో రియల్ ఎస్టేట్ సంస్థలకు బహుమతులు అందజేశారు.

వాసవీ గ్రూప్‌నకు సస్టేనబుల్ స్టాల్ అవార్డు

వినియోగదారులకు అత్యున్నత ప్రమాణాలతో మెరుగైన సేవలు అందిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న వాసవీ గ్రూప్‎నకు క్రెడాయ్ ప్రాపర్టీ షోలో తన ప్రత్యేకతను చాటుకుంది. క్రెడాయ్ 10వ ఎడిషన్‌లో సస్టేనబుల్ స్టాల్ అవార్డును సొంతం చేసుకుంది. వాసవీ గ్రూప్ తరుఫున మార్కెటింగ్ హెడ్ కుశలవరెడ్డి అవార్డు అందుకున్నారు.

Tags:    

Similar News