Mahesh Babu : మహేష్ బాబుపై రూమర్స్.. ఉలిక్కిపడుతున్న ఫ్యాన్స్

దిశ, వెబ్‌డెస్క్:  టాలీవుడ్ లో హీరో- దర్శకుడు అనే కొన్ని మర్చిపోలేని కాంబినేషన్లు ఉన్నాయి. పవన్ – త్రివిక్రమ్, మహేష్ బాబు- పూరి జగన్నాధ్, నాని- శివ నిర్వాణ ఇలా పేరుతెచ్చిన కాంబినేషన్లు పై అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే వీటితో పాటు తమ అభిమాన హీరోకి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడిని కూడా ఫ్యాన్స్ అంట త్వరగా మర్చిపోరు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ‘స్పైడర్’ సినిమాతో డిజాస్టర్ అంటకట్టిన మురగదాస్ ని […]

Update: 2021-06-06 02:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో హీరో- దర్శకుడు అనే కొన్ని మర్చిపోలేని కాంబినేషన్లు ఉన్నాయి. పవన్ – త్రివిక్రమ్, మహేష్ బాబు- పూరి జగన్నాధ్, నాని- శివ నిర్వాణ ఇలా పేరుతెచ్చిన కాంబినేషన్లు పై అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే వీటితో పాటు తమ అభిమాన హీరోకి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడిని కూడా ఫ్యాన్స్ అంట త్వరగా మర్చిపోరు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ‘స్పైడర్’ సినిమాతో డిజాస్టర్ అంటకట్టిన మురగదాస్ ని మహేష్ అభిమానులు ఎప్పటికి మర్చిపోరు. ఇక గత కొన్ని రోజుల నుంచి వీరి ఇద్దరికీ సంబంధించిన ఓ వార్త మహేష్ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది.

ఇప్పటికే ‘స్పైడర్’ లాంటి సినిమాతో మహేష్ కి అట్టర్ ఫ్లాఫ్ ఇచ్చిన మురగదాస్ తో మహేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుంది అనే పుకారు ఫ్యాన్స్ గుండెల్లో గుబులు రేపుతోంది. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉంటున్న మహేష్ కి మురగదాస్ కథను వినిపించాడని, దానికి మహేష్ సైతం ఓకే చెప్పాడని ఆ పుకారు సారాంశం. ఇక ఈ రూమర్ ఎవరు క్రియేట్ చేశారో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. ఇక తాజాగా మహేష్ లైన్ అప్ చూసుకొంటే ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’, ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓ మూవీ, ఈ రెండు తర్వాత రాజమౌళి తో పాన్ ఇండియా మూవీ.. ఇలా పక్కా ప్లాన్ చేసుకున్న మహేష్ కి మధ్య లో ఈ మురగదాస్ టెన్షన్ ఏంటి రా బాబు అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ వార్త పుకారుగానే ఉండాలని అభిమానులు దేవుడికి వెయ్యి దండాలు పెట్టుకుంటున్నారు.

Tags:    

Similar News