‘ఆ ఆస్పత్రులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలి’
దిశ, వరంగల్: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. హన్మకొండలోని పార్టీ ఆఫీస్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సర్కార్ కరోనా బాధితులకు వైద్యం అందించలేకపోవటంతో, ప్రైవేట్ ఆస్పత్రులకు వైద్యం కోసం వెళితే విచ్చల విడిగా బిల్లులు వేసి దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. సర్కార్ కరోనా బాధితులకు వైద్యం అందించటం కోసం ప్రైవేట్ ఆస్పత్రులన్నింటినీ […]
దిశ, వరంగల్: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. హన్మకొండలోని పార్టీ ఆఫీస్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సర్కార్ కరోనా బాధితులకు వైద్యం అందించలేకపోవటంతో, ప్రైవేట్ ఆస్పత్రులకు వైద్యం కోసం వెళితే విచ్చల విడిగా బిల్లులు వేసి దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. సర్కార్ కరోనా బాధితులకు వైద్యం అందించటం కోసం ప్రైవేట్ ఆస్పత్రులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా భాదితులందరికీ వైద్యం అందించాలని, కరోనా కట్టడి చేయాలని ఈ నెల 16న తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో సత్యాగ్రహ దీక్ష చేపడుతామన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు భేషరతుగా విరసం నేత వరవరరావును విడుదల చేసి, మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేసారు.