ఎమ్మెల్యేలకో న్యాయం.. ప్రజలకో న్యాయమా !: తమ్మినేని
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్‌కు ఓ పద్ధతి, సామాన్యులకు మరో పద్దతా అని ప్రశ్నించారు. కరోనా పరీక్షలను విస్తృతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సీపీఐ (ఎం) నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో తమ్మినేనితో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా […]
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్‌కు ఓ పద్ధతి, సామాన్యులకు మరో పద్దతా అని ప్రశ్నించారు. కరోనా పరీక్షలను విస్తృతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సీపీఐ (ఎం) నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో తమ్మినేనితో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ దేశంలో 300కేసులు ఉన్నప్పుడు లాక్‌డౌన్ అమలు చేసి, మూడున్నర లక్షలు దాటుతున్నాతరుణంలో నిబంధనలను కఠినతరం చేయట్లేదన్నారు. కరోనా పరీక్షలను విస్తృతం చేయాలనే డిమాండ్‌పై ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలన్నారు. దేశంలో 47లక్షల కరోనా పరీక్షలు మాత్రమే చేశారని విమర్శించారు. కరోనా లక్షణాలు లేకుంటే టెస్టులు చేయమని సీఎం, వైద్యశాఖ మంత్రి చెబుతూనే మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్‌కు టెస్టులు చేశారన్నారు. ప్రభుత్వం సామాన్యుల ఆరోగ్య భద్రత పట్ల ఓ పాలసీ.. ప్రజా ప్రతినిధుల పట్ల మరో రకంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడటానికి సీఎం కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జి. నాగయ్య, నరసింహారావు, టి.జ్యోతి, జాన్‌వెస్లీ, ఎం. సాయిబాబు పాల్గొన్నారు.