'అసదుద్దీన్.. నిజామాబాద్ ఎంఐఎం నేతల తీరు మీకెందుకు అర్థంకావట్లేదు?'
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఎంఐఎం నేతల రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ కాలనీలో ఇండ్లు కోల్పోయినవారు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మహమ్మద్ అబ్బాస్ ధర్మపురి హిల్స్ కాలనీలో కూల్చిన ఇండ్లను పరిశీలించారు. అనంతరం బాధితులతో కలిసి మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఎంఐఎం నేతల రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ కాలనీలో ఇండ్లు కోల్పోయినవారు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మహమ్మద్ అబ్బాస్ ధర్మపురి హిల్స్ కాలనీలో కూల్చిన ఇండ్లను పరిశీలించారు. అనంతరం బాధితులతో కలిసి మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ ముస్లిం సమాజాన్ని మేమే ఉద్ధరిస్తున్నామని, దీనికి మేమే ప్రతినిధులమని విర్రవీగుతున్న ఎంఐఎం అధినేతలు అసదుద్దీన్ ఓవైసీకి నిజామాబాద్ నగరంలో ఎంఐఎం నేతలు ముస్లిం సమాజం పట్ల వ్యవహరిస్తున్న తీరు ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు. ఎంఐఎం నేతల భూ దాహానికి నిరుపేదలను బలి చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇళ్లు కోల్పోయి వారం రోజులు గడుస్తున్నా అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ ఎందుకు వారివైపు కన్నెత్తి చూడడం లేదని అన్నారు. తీవ్రమైన చలిలో కూడా వారం రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నా స్పందించకపోవడంతో కలెక్టరేట్ కి తరలి వచ్చారన్నారు. అధికారులు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుజాత, రాములు, నగర కమిటీ సభ్యులు నరసయ్య కృష్ణ, అబ్దుల్, మునీర్, అహ్మద్, 100 మంది ధర్మపురి హిల్స్ కాలనీ వాసులు పాల్గొన్నారు.