పాఠ్యపుస్తకంలో ఆ.. పాఠాన్ని ఎందుకు తొలగించారని సీఎంకు లేఖ
దిశ, ఏపీ బ్యూరో: అమరావతి అనే పదంపై రాష్ట్రప్రభుత్వం వివక్ష చూపుతోందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కు ఆయన లేఖ రాశారు. పదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించటం దుర్మార్గమన్నారు. 2014లో 12 పాఠాలతో ముద్రించిన పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో రెండో పాఠంగా అమరావతి ఉందని.. ఇప్పుడు కొత్తగా పాఠశాల విద్యాశాఖ అమరావతి పాఠాన్ని తొలగించి, మిగిలిన 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించడం విచారకరమన్నారు. […]
దిశ, ఏపీ బ్యూరో: అమరావతి అనే పదంపై రాష్ట్రప్రభుత్వం వివక్ష చూపుతోందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కు ఆయన లేఖ రాశారు. పదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించటం దుర్మార్గమన్నారు. 2014లో 12 పాఠాలతో ముద్రించిన పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో రెండో పాఠంగా అమరావతి ఉందని.. ఇప్పుడు కొత్తగా పాఠశాల విద్యాశాఖ అమరావతి పాఠాన్ని తొలగించి, మిగిలిన 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించడం విచారకరమన్నారు. దాదాపు 20 శతాబ్ధాల ఘనచరిత్ర కలిగిన ప్రాంతంగా ఉన్న అమరావతి నేపథ్యాన్ని భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు. పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో అమరావతి పాఠాన్ని తిరిగి చేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.