మద్యపాన నిషేధం కొనసాగించాలి
– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసే వరకు మద్యపాన నిషేధం కొనసాగించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాణయ అన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన ద్వారా పలు అంశాలను వెల్లడించారు. పాక్షిక సడలింపులో భాగంగా మద్యం అమ్మకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతివ్వడం దివాళాకోరుతనమేనని ఎద్దేవా చేశారు. మద్యం ఆర్థిక వనరుగా పరిగణించడం అనైతికమని అన్నారు. మద్యపాన నిషేధం చేసిన బీహార్ రాష్ట్రం పెద్దగా నష్టపోయిందేమీ లేదన్నారు. లాక్‌డౌన్‌లో […]
– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసే వరకు మద్యపాన నిషేధం కొనసాగించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాణయ అన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన ద్వారా పలు అంశాలను వెల్లడించారు. పాక్షిక సడలింపులో భాగంగా మద్యం అమ్మకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతివ్వడం దివాళాకోరుతనమేనని ఎద్దేవా చేశారు. మద్యం ఆర్థిక వనరుగా పరిగణించడం అనైతికమని అన్నారు. మద్యపాన నిషేధం చేసిన బీహార్ రాష్ట్రం పెద్దగా నష్టపోయిందేమీ లేదన్నారు. లాక్‌డౌన్‌లో వాహన ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి దేశంలో పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేసే వరకు మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని కోరారు.
tags: Lockdown,Corona,Alcohol,Shops, Cpi, Narayana