రాజీనామాలు.. సవాళ్లు సర్వసాధారణమే
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మూడు రాజధానుల విషయం గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తరుణంలో రాష్ట్రంలో మళ్లీ నిరసనలు మిన్నంటాయి. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రజల్లో ఛీటర్‌గా మిగిలిపోవద్దని సూచించారు. అమరావతి రాజధానికి మద్దతిచ్చి.. మాట తప్పొద్దని రామకృష్ణ తెలిపారు. రాజీనామాల సవాళ్లు సర్వసాధారణమేనన్నారు. ఎవరు కూడా రాజీనామా చేసి ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లరని చెప్పారు. […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మూడు రాజధానుల విషయం గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తరుణంలో రాష్ట్రంలో మళ్లీ నిరసనలు మిన్నంటాయి. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రజల్లో ఛీటర్‌గా మిగిలిపోవద్దని సూచించారు.
అమరావతి రాజధానికి మద్దతిచ్చి.. మాట తప్పొద్దని రామకృష్ణ తెలిపారు. రాజీనామాల సవాళ్లు సర్వసాధారణమేనన్నారు. ఎవరు కూడా రాజీనామా చేసి ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లరని చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని పునరాలోచించాలని రామకృష్ణ సూచించారు. అమరావతే రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.