రూ. కోటి పరిహారమివ్వాలి: జేవీ సత్యనారాయణ

దిశ, ఏపీ బ్యూరో: విశాఖలోని పారిశ్రామిక వాడ పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ప్రమాదంలో బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. వైజాగ్‌లో ఆయన మాట్లాడుతూ, ఎల్జీపాలిమర్స్ ఘటనలో బాధితులకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించిన సంగతి గుర్తు చేస్తూ, ఇది కూడా అలాంటి ప్రమాదమేనని సూచించారు. ఈ ప్రమాద బాధితులకు కూడా కోటి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం […]

Update: 2020-07-02 01:03 GMT
రూ. కోటి పరిహారమివ్వాలి: జేవీ సత్యనారాయణ
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: విశాఖలోని పారిశ్రామిక వాడ పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ప్రమాదంలో బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. వైజాగ్‌లో ఆయన మాట్లాడుతూ, ఎల్జీపాలిమర్స్ ఘటనలో బాధితులకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించిన సంగతి గుర్తు చేస్తూ, ఇది కూడా అలాంటి ప్రమాదమేనని సూచించారు. ఈ ప్రమాద బాధితులకు కూడా కోటి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రసాయన పరిశ్రమల్లో తనిఖీలు ఎప్పటికప్పుడు జరిగేలా చూడాలని ఆయన సూచించారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో కంపెనీ నిర్వహాకుల్లో ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదన్న ఆయన, ఈ ప్రమాదంపై కూడా అదే తరహా చర్యలుంటాయని అభిప్రాయపడ్డారు. ప్రమాదాలు జరిగినప్పుడు కంపెనీల వద్ద హడావుడి చేయడమే తప్ప ప్రభుత్వానికి పరిశ్రమల్లో తీసుకుంటున్న సేఫ్టీ మెజర్స్‌పై ఎలాంటి నియంత్రణా లేదని అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రతిపక్షాలను మాత్రం అడ్డుకుంటారని ఆయన మండిపడ్డారు.

Tags:    

Similar News