ఫీల్డ్ అసిస్టెంట్లపై సీపీ సత్యనారాయణ సీరియస్.. ఎందుకంటే..?

దిశ, హుజురాబాద్: హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు మాస్క్ లేదన్న కారణంతో కొంత మంది ఫీల్డ్ అసిస్టెంట్లపై సీపీ సత్యనారాయణ సీరియస్ అయ్యారు. నామినేషన్ పత్రాల కోసం వచ్చిన వారిపై ఆయన ఎందుకు సీరియస్ అయ్యారో అర్ధం కాలేదు. అసలు మీరు ఎందుకు వచ్చారని సీపీ ప్రశ్నించిన క్రమంలో వారి బాధ చెప్పుకునే ప్రయత్నం చేశారు. వారి గోడు వినకుండా మాస్క్ లేదన్న కారణంతో అక్కడి నుండి పంపివేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సోమవారం హుజురాబాద్ […]

Update: 2021-10-04 10:41 GMT

దిశ, హుజురాబాద్: హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు మాస్క్ లేదన్న కారణంతో కొంత మంది ఫీల్డ్ అసిస్టెంట్లపై సీపీ సత్యనారాయణ సీరియస్ అయ్యారు. నామినేషన్ పత్రాల కోసం వచ్చిన వారిపై ఆయన ఎందుకు సీరియస్ అయ్యారో అర్ధం కాలేదు. అసలు మీరు ఎందుకు వచ్చారని సీపీ ప్రశ్నించిన క్రమంలో వారి బాధ చెప్పుకునే ప్రయత్నం చేశారు. వారి గోడు వినకుండా మాస్క్ లేదన్న కారణంతో అక్కడి నుండి పంపివేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సోమవారం హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే తాను కొవిడ్ నిబంధనల ప్రకారం మందలించానని సీపీ చెప్పుకుంటున్నప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తున్నారని.. వారిని అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పోలీసులు ఫీల్డ్ అసిస్టెంట్లను అటాక్ చేయడం, తమను పోలీసులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్ధం కావడం లేదని ఆందోళనకు గురయ్యారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బరిలో నిలుస్తామన్న ఫీల్డ్ అసిస్టెంట్లకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News