2 గంటల తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే.. సజ్జనార్ సీరియస్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌‌‌ను అందరూ పాటించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. సడలింపు పనులన్నీ చేసుకోవాలని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎవరైన అకారణంగా బయటకొస్టే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకే దాకాణాలు, ఆఫీసులన్నీ మూసేయాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిచినా, ఆఫీసులు ఓపెన్ చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లేవారు […]

Update: 2021-05-31 06:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌‌‌ను అందరూ పాటించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. సడలింపు పనులన్నీ చేసుకోవాలని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎవరైన అకారణంగా బయటకొస్టే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకే దాకాణాలు, ఆఫీసులన్నీ మూసేయాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిచినా, ఆఫీసులు ఓపెన్ చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లేవారు తగిన పత్రాలు చూపించాలని అన్నారు.

Tags:    

Similar News