హైదరాబాద్ పాతబస్తీలో సీపీ అంజనీ కుమార్
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో అత్యవసర సర్వీసులను అడ్డుకోవద్దని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు లాక్ డౌన్ నాలుగవ రోజైన శనివారం ఆయన క్రైమ్స్ అదనపు సీపీ చౌహాన్ తో కలిసి పాతబస్తీలో లాక్ డౌన్ అమలవుతున్న తీరును గుర్రపు స్వారీ చేయడం ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ స్థానికంగా ఉన్న పరిస్థితులు సమీక్షించి చెక్ పోస్టులు, బారీకేడ్ల వద్ద పోలీసుల […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో అత్యవసర సర్వీసులను అడ్డుకోవద్దని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు లాక్ డౌన్ నాలుగవ రోజైన శనివారం ఆయన క్రైమ్స్ అదనపు సీపీ చౌహాన్ తో కలిసి పాతబస్తీలో లాక్ డౌన్ అమలవుతున్న తీరును గుర్రపు స్వారీ చేయడం ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ స్థానికంగా ఉన్న పరిస్థితులు సమీక్షించి చెక్ పోస్టులు, బారీకేడ్ల వద్ద పోలీసుల తనిఖీలు చేయడంతో పాటు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అత్యవసర సర్వీసులకు అనుమతించాలని సూచించారు. క్రైమ్స్ అదనపు సీపీ చౌహాన్ మాట్లాడుతూ హైదరాబాద్ వ్యాప్తంగా లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామన్నారు.
పోలీసులకు సహకరిస్తున్న ప్రతి ఒక్క నగర పౌరునికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రజలకు ఎవరు బయటికి రాకూడదని, పాతబస్తీలో వదంతులు నమ్మవద్దని, లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలు అవుతోందని, పాతబస్తీలోని మాదన్నపేట మార్కెట్, మిరాళం మండి, మీర్ చౌక్ మార్కెట్, ఫలక్‌నుమ తదితర హాట్ స్పాట్ ప్రాంతాల్లో సిటీ రిజర్వ్ పోలీసులతో పర్యవేక్షణ జరుపుతున్నమన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని, ఆన్ లైన్ ద్వారా అవసరం ఉన్న వారికి ఈ-పాసులు జారీ చేస్తున్నామని , హైదరాబాదులో 24 గంటల పాటు పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయాలని ఆయన ప్రజలకు సూచించారు.