ఇండియాలో ‘కొవావాక్స్’ ట్రయల్స్ షురూ

ముంబై: భారత్‌లో కొవావాక్స్ టీకా ట్రయల్స్ ఎట్టకేలకు ప్రారంభమయ్యాయని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అమెరికా ఫార్మా సంస్థ నొవావాక్స్‌తో ఎస్ఐఐ కలిసి ఈ టీకాను అభివృద్ధి చేసిందని వివరించారు. భారత్ సహా పేద, మధ్యతరగతి దేశాలలో సరఫరా చేయడానికి నొవావాక్స్‌తో సీరం ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఆఫ్రికా, యూకే వేరియంట్లపైనా ఈ టీకాను పరీక్షించారని, ఓవరాల్‌గా 89 శాతం సమర్థతను కలిగి […]

Update: 2021-03-27 05:45 GMT

ముంబై: భారత్‌లో కొవావాక్స్ టీకా ట్రయల్స్ ఎట్టకేలకు ప్రారంభమయ్యాయని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అమెరికా ఫార్మా సంస్థ నొవావాక్స్‌తో ఎస్ఐఐ కలిసి ఈ టీకాను అభివృద్ధి చేసిందని వివరించారు. భారత్ సహా పేద, మధ్యతరగతి దేశాలలో సరఫరా చేయడానికి నొవావాక్స్‌తో సీరం ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఆఫ్రికా, యూకే వేరియంట్లపైనా ఈ టీకాను పరీక్షించారని, ఓవరాల్‌గా 89 శాతం సమర్థతను కలిగి ఉన్నట్టు తేలిందని వివరించారు. ఈ టీకాపై యూకేలో ట్రయల్స్ జరిగాయి. ఇందులో ఓవరాల్‌గా 89.3శాతం సమర్థతను ఈ టీకా కలిగి ఉన్నట్టు ఫలితాలు వచ్చాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకాలతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్న సీరం ఇప్పటికీ కొవిషీల్డ్ టీకాను భారత్‌లో పంపిణీకి అందిస్తున్నారు. ఇతర దేశాలకు ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌లను ఎగుమతి చేస్తున్నది.

Tags:    

Similar News