కొవావాక్స్ టీకాకు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన మరో టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. భారత్‌లో తయారు చేసిన యూఎస్ ఆధారిత సంస్థ నొవావాక్స్‌కు చెందిన కొవావాక్స్ టీకాకు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం తెలిపింది. సీరం సంస్థ నుంచి అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన రెండో వ్యాక్సిన్‌గా కొవావాక్స్ నిలిచింది. కాగా అంతర్జాతీయ టీకా భాగస్వామ్య వ్యవస్థ కొవాక్స్‌లో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు. ‘కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నప్పటికీ, వ్యాక్సిన్లు […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన మరో టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. భారత్‌లో తయారు చేసిన యూఎస్ ఆధారిత సంస్థ నొవావాక్స్‌కు చెందిన కొవావాక్స్ టీకాకు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం తెలిపింది. సీరం సంస్థ నుంచి అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన రెండో వ్యాక్సిన్‌గా కొవావాక్స్ నిలిచింది. కాగా అంతర్జాతీయ టీకా భాగస్వామ్య వ్యవస్థ కొవాక్స్‌లో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు.
‘కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నప్పటికీ, వ్యాక్సిన్లు ప్రజలను కరోనాతో అనారోగ్యం పాలైన మరణాన్ని దూరం చేయడంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది’ అని డబ్ల్యూహెచ్‌వో వ్యాక్సిన్ యాక్సెస్ చీఫ్ మరియంగెలా సిరిమావో అన్నారు. కాగా తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో టీకా లభ్యత పెంచేందుకు ఇది దోహదపడుతుందని ఆమె తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలు తమ జనాభాలో 10 శాతానికి పైగా వ్యాక్సిన్ ఇవ్వకపోగా, 98 దేశాల్లో ఆ సంఖ్య 40 శాతానికి కూడా చేర లేదని వెల్లడించారు.
కొవిడ్‌పై పోరులో మరొక మైలురాయిని అందుకున్నామని సీరం సీఈవో అదర్ పూనవాలా అన్నారు. ‘కొవావాక్స్ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం పొందింది. అత్యంత సురక్షితం, సమర్ధవంతమని నిరూపించుకుంది. సహకారం అందించిన వారికి ధన్యవాదాలు’ అని తెలిపారు. ఈ రెండు డోసుల వ్యాక్సిన్ 2 నుంచి 8 డిగ్రీల రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంటుంది.