‘కరోనా ఆస్పత్రిలో కనీసం తాగే నీళ్లు లేవు’

లక్నో: ‘ఈ ఆసుపత్రిలో ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కనీసం తాగే నీళ్లు కూడా లేవు. తట్టుకోలేకపోతున్నాను. వేరే చోటకి తరలించండి. ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఏ సదుపాయాలను ఏర్పాటు చేయలేదు. ఇక్కడ అంతా నిర్లక్ష్యమే కనిపిస్తున్నది’ యూపీలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో మరణానికి ముందు ఓ కరోనా పేషంట్ రికార్డ్ చేసిన వీడియోలోని మాటలు ఇవి. https://twitter.com/NarendraRajpal3/status/1287977795117752322?s=20 ఝాన్సీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో సోమవారం చేరిన ఆ పేషెంట్ శ్వాసతీయడానికే ఇబ్బంది పడుతూ ఈ వీడియో రికార్డ్ చేశారు. అతని దుస్తులు […]

Update: 2020-07-28 07:25 GMT

లక్నో: ‘ఈ ఆసుపత్రిలో ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కనీసం తాగే నీళ్లు కూడా లేవు. తట్టుకోలేకపోతున్నాను. వేరే చోటకి తరలించండి. ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఏ సదుపాయాలను ఏర్పాటు చేయలేదు. ఇక్కడ అంతా నిర్లక్ష్యమే కనిపిస్తున్నది’ యూపీలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో మరణానికి ముందు ఓ కరోనా పేషంట్ రికార్డ్ చేసిన వీడియోలోని మాటలు ఇవి.

https://twitter.com/NarendraRajpal3/status/1287977795117752322?s=20

ఝాన్సీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో సోమవారం చేరిన ఆ పేషెంట్ శ్వాసతీయడానికే ఇబ్బంది పడుతూ ఈ వీడియో రికార్డ్ చేశారు. అతని దుస్తులు రక్తంతో తడిసిపోయినట్టు వీడియోలో కనిపించింది. సోమవారం ఆయన చనిపోయాక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పేషంట్ భార్య, కూతురికీ కరోనా పాజిటివ్ తేలినట్టు ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. శ్వాస సమస్యలతో ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్‌లో శుక్రవారం చేరిన ఓ వ్యక్తి 24 గంటల్లోనే ఎస్కేప్ అయిన సంగతి తెలిసిందే. హాస్పిటల్‌లో వసతులులేవని ప్రశ్నించినందున వేధించారని, అందుకే అతను పారిపోయి వచ్చినట్టు అతను కుటుంబీకులు ఆరోపించారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు కరోనా పేషెంట్ల కోసం యూపీ సర్కారు తీసుకుంటున్న చర్యలపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

Tags:    

Similar News