నీతులు చెప్పిన మంత్రే ఇలా చేస్తే ఎలా..?

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటున్నారు. ఇందుకు సంబంధించి పలు అంశాలను ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించి కరోనా బారిన పడకుండా ఉండండి అంటూ జాగ్రత్త పరుస్తున్నారు. అయితే ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఓ సంఘటన చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియా ఓ వార్తను ప్రచురించింది. ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి అమర్జిత్ భగత్ కొవిడ్ నిబంధనలను తుంగలోకి తొక్కారు. […]

Update: 2020-06-22 23:24 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటున్నారు. ఇందుకు సంబంధించి పలు అంశాలను ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించి కరోనా బారిన పడకుండా ఉండండి అంటూ జాగ్రత్త పరుస్తున్నారు. అయితే ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఓ సంఘటన చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియా ఓ వార్తను ప్రచురించింది. ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి అమర్జిత్ భగత్ కొవిడ్ నిబంధనలను తుంగలోకి తొక్కారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం సూరగుజలోని అంబికాపూర్‌లో ఆయన పలువురికి మాస్కులు, ఇతర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ఏ మాత్రం సామాజిక దూరం పాటించలేదు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన కొవిడ్ గురించి మాట్లాడుతూ.. ‘ఇప్పట్లో కొవిడ్ పోయే పరిస్థితి లేదు. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. సామాజిక దూరం పాటించాలి’ అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం తెలిసిన ప్రజలు నీతులు చెప్పిన మంత్రే ఇలా చేస్తే ఎలా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News