ఎంఎస్ఎంఈలకు సవాలుగా మారిన నగదు లభ్యత

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి ఎంఎస్ఎంఈలను తీవ్రంగా దెబ్బతీసిందని నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. ‘కొవిడ్-19 అనంతరం ఎంఎస్ఎంఈల స్థిరమైన వృద్ధి’ పేరుతో జరిగిన వెబ్‌నార్‌లో మాట్లాడిన ఆయన.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నగదు లభ్యత, మూలధన సమస్యలు సవాలుగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్ఎంఈల కోసం నగదు ఆధారిత నిధులు అందించేందుకు కేంద్రం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఎంఎస్ఎంఈల ద్రవ్య పరిమితిని పరిష్కరించేందుకు కేంద్రం తీసుకునే చర్యలు సహాయంగా ఉంటాయన్నారు. […]

Update: 2021-07-30 07:56 GMT
ఎంఎస్ఎంఈలకు సవాలుగా మారిన నగదు లభ్యత
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి ఎంఎస్ఎంఈలను తీవ్రంగా దెబ్బతీసిందని నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. ‘కొవిడ్-19 అనంతరం ఎంఎస్ఎంఈల స్థిరమైన వృద్ధి’ పేరుతో జరిగిన వెబ్‌నార్‌లో మాట్లాడిన ఆయన.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నగదు లభ్యత, మూలధన సమస్యలు సవాలుగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్ఎంఈల కోసం నగదు ఆధారిత నిధులు అందించేందుకు కేంద్రం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఎంఎస్ఎంఈల ద్రవ్య పరిమితిని పరిష్కరించేందుకు కేంద్రం తీసుకునే చర్యలు సహాయంగా ఉంటాయన్నారు. కరోనా మహమ్మారి లాంటి సంక్షోభ సమయంలో పెద్ద కంపెనీలు మెరుగైన లాభాలు ఆర్జించాయని, ఎంఎస్ఎంఈల ఆదాయాలు మాత్రం 50 శాతం దెబ్బతిన్నాయని రాజీవ్ కుమారు వివరించారు. ఎక్కువ సంఖ్యలో ఎంఎస్ఎంఈ సంస్థలు వ్యాపారాలను మూసేశాయని ఆయన పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు విస్తృతమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ మరింత శ్రద్ధగా ఉండాల్సి ఉందని, సవాళ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా తన వంతు ప్రయత్నం చేస్తోందని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News