బంగ్లాదేశ్, నేపాల్‌కు చేరుకున్న కొవాగ్జిన్

న్యూఢిల్లీ: నేపాల్, బంగ్లాదేశ్‌లకు కరోనా వ్యాక్సిన్ టీకాలను భారత్ గురువారం అందజేసింది. ‘పొరుగు దేశాలకు ప్రాధాన్యం’ విధానంలో భాగంగా బంగ్లాదేశ్‌కు 20 లక్షలు, నేపాల్‌కు 10 లక్షల కొవాగ్జిన్ డోసులను పంపిన విషయం తెలిసిందే. టీకా డోసులు ఆయా దేశాలకు చేరుకున్నాయి. బుధవారం భూటాన్‌కు 1,50,000, మల్దీవులకు 1,00,00 కొవాగ్జిన్‌ డోసులను పంపిన విషయం తెలిసిందే. ఆయా దేశాలు కరోనా మహమ్మారి ఎదుర్కోవడం కోసం హైడ్రాక్సీక్లోరోక్వీన్, రెమిడెసివర్, పారాసెటిమల్ ట్యాబ్లెట్లతోపాటు డయోగ్నస్టిక్ కిట్లు, వెంటిలేటర్లు, మాస్కులు, గ్లౌసులు […]

Update: 2021-01-21 11:05 GMT

న్యూఢిల్లీ: నేపాల్, బంగ్లాదేశ్‌లకు కరోనా వ్యాక్సిన్ టీకాలను భారత్ గురువారం అందజేసింది. ‘పొరుగు దేశాలకు ప్రాధాన్యం’ విధానంలో భాగంగా బంగ్లాదేశ్‌కు 20 లక్షలు, నేపాల్‌కు 10 లక్షల కొవాగ్జిన్ డోసులను పంపిన విషయం తెలిసిందే. టీకా డోసులు ఆయా దేశాలకు చేరుకున్నాయి. బుధవారం భూటాన్‌కు 1,50,000, మల్దీవులకు 1,00,00 కొవాగ్జిన్‌ డోసులను పంపిన విషయం తెలిసిందే. ఆయా దేశాలు కరోనా మహమ్మారి ఎదుర్కోవడం కోసం హైడ్రాక్సీక్లోరోక్వీన్, రెమిడెసివర్, పారాసెటిమల్ ట్యాబ్లెట్లతోపాటు డయోగ్నస్టిక్ కిట్లు, వెంటిలేటర్లు, మాస్కులు, గ్లౌసులు ఇతర వైద్య పరికరాలను కూడా అందించింది.

Tags:    

Similar News