బసవతారక నగర్ భూ నిర్వాసితులకు భారీ ఊరట.. స్టే ఇచ్చిన కోర్ట్
దిశ, శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లి బసవతారక నగర్ భూ బాధితులకు న్యాయస్థానంలో ఉపశమనం లభించింది. గోపన్ పల్లి సర్వే నెంబర్ 37లో గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న వందలాది కుటుంబాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈనెల 8వ తేదీన ఉదయమే రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేతలు చేపట్టారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు పేదల వద్ద డబ్బులు వసూలు చేసిన నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో […]
దిశ, శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లి బసవతారక నగర్ భూ బాధితులకు న్యాయస్థానంలో ఉపశమనం లభించింది. గోపన్ పల్లి సర్వే నెంబర్ 37లో గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న వందలాది కుటుంబాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈనెల 8వ తేదీన ఉదయమే రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేతలు చేపట్టారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు పేదల వద్ద డబ్బులు వసూలు చేసిన నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో బసవతారక నగర్ ప్రజలు రోడ్డున పడ్డారు. గత 17 రోజులుగా చలి, ఎండలను లెక్క చేయకుండా అక్కడే ఉంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీరి పోరాటానికి ఆయా పార్టీలు మద్దతు ఇచ్చాయి.
బీజేపీ రాష్ట్ర నాయకులు మారబోయిన రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిలు మొదటి నుండి భూ నిర్వాసితులకు అండగా ఉంటూ వస్తున్నారు. అలాగే ఒడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు కూడా బసవతారక నగర్ ప్రజలకు మద్దతు నిలిచారు. ఈ నేపథ్యంలో ఇళ్ల కూల్చివేతలపై కోర్టుకు వెళ్లిన భూ నిర్వాసితులకు స్టే మంజూరయింది. న్యాయవాది బాబురావు శుక్రవారం న్యాయస్థానం ముందు బసవతారక నగర్ భూ నిర్వాసితుల గోడు వినిపించారు. న్యాయవాది బాబురావు వాదనాలపై సానుకూలంగా స్పందించిన కోర్టు యధాతధ స్థితి కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. కోర్టు స్టే రావడం పట్ల భూ నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.