కామారెడ్డిలో నవదంపతుల ఫొటోలు వైరల్.. భారీగా ప్రశంసలు
దిశ, కామారెడ్డి: కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామంలో నవదంపతులు డా.బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన గైని నవీన్ కు రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన భార్గవితో బుధవారం వివాహం జరిగింది. వివాహం అనంతరం రాత్రి ఇస్రోజీవాడి గ్రామానికి చేరుకున్న ఆ యువజంట నేరుగా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆయనకు పూలమాల వేయడంతోపాటు బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్లు మొక్కి […]
దిశ, కామారెడ్డి: కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామంలో నవదంపతులు డా.బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన గైని నవీన్ కు రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన భార్గవితో బుధవారం వివాహం జరిగింది. వివాహం అనంతరం రాత్రి ఇస్రోజీవాడి గ్రామానికి చేరుకున్న ఆ యువజంట నేరుగా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆయనకు పూలమాల వేయడంతోపాటు బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. నవ దంపతుల నిర్ణయం పట్ల గ్రామస్తులతోపాటు ఇతరులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.