నాలుగు రాష్ట్రాలు లాక్‌డౌన్
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. 14 గంటల జనతా కర్ఫ్యూ పాటిస్తున్నా.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ బాట పడుతున్నాయి. ఈ నెల 31వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. రాజస్తాన్ కూడా ఇదే తరహా ఆదేశాలను జారీ చేసింది. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలూ నిలిపేయనున్నట్టు ప్రకటించింది. వీటితోపాటు ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. కాగా, మహారాష్ట్రలో రాష్ట్రవ్యాప్తంగా 144 […]
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. 14 గంటల జనతా కర్ఫ్యూ పాటిస్తున్నా.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ బాట పడుతున్నాయి. ఈ నెల 31వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. రాజస్తాన్ కూడా ఇదే తరహా ఆదేశాలను జారీ చేసింది. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలూ నిలిపేయనున్నట్టు ప్రకటించింది. వీటితోపాటు ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. కాగా, మహారాష్ట్రలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయనున్నట్టు సమాచారం. కాగా, తెలంగాణలోనూ ఈ లాక్‌డౌన్‌ను సీఎం ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. అవసరమైతే లాక్‌డౌన్ చేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Tags: lockdown, coronavirus, announcement, 144 section, punjab, rajasthan