నల్లమలలో ముగిసిన పెద్ద పులుల గణన

దిశ, అచ్చంపేట: నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ అభర్యాణ్యంలో పెద్ద పులుల గణన సోమవారంతో ముగిసింది. గత మూడు రోజుల నుండి అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలోని అచ్చంపేట, అమ్రాబాద్ డివిజన్‌లో ఉన్న 8 రేంజ్‌లోని కొల్లపూర్, లింగాల, అచ్చంపేట మద్దిమడుగు, అమ్రాబాద్, మన్ననూర్, దోమలపెంట రేంజ్ అటవీ ఏరియాలలో ఈ నెల 27 నుంచి 29 వరకు ప్రతి రోజు 2 కి.మీ మేర సర్వేను పూర్తి చేశారు. యూ లైన్‌లో మాంసాహార జంతువులతోపాటు శాకాహార […]

Update: 2021-11-29 08:22 GMT

దిశ, అచ్చంపేట: నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ అభర్యాణ్యంలో పెద్ద పులుల గణన సోమవారంతో ముగిసింది. గత మూడు రోజుల నుండి అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలోని అచ్చంపేట, అమ్రాబాద్ డివిజన్‌లో ఉన్న 8 రేంజ్‌లోని కొల్లపూర్, లింగాల, అచ్చంపేట మద్దిమడుగు, అమ్రాబాద్, మన్ననూర్, దోమలపెంట రేంజ్ అటవీ ఏరియాలలో ఈ నెల 27 నుంచి 29 వరకు ప్రతి రోజు 2 కి.మీ మేర సర్వేను పూర్తి చేశారు.

యూ లైన్‌లో మాంసాహార జంతువులతోపాటు శాకాహార జంతువులు, ప్రత్యక్షంగా కనిపించిన జంతువుల నమోదు పక్రియను కొనసాగించారు. సర్వే చేసిన ప్రదేశంలో ప్రతి 400 మీటర్ల ఏరియాలో చెట్ల పేర్లు, గడ్డి జాతుల పేర్లు, శాకాహార జంతువుల పెంటికలు వివరాలను నమోదు చేశారు. కాగా, సెప్టెంబర్‌లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారటి న్యూఢిల్లీ సూచనల మేరకు కెమెరా ట్రాపింగ్‌ ద్వారా జంతువుల వివరాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News