లాక్ డౌన్ విధించారని బాధపడొద్దు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే
దిశ, నిజామాబాద్: జుక్కల్ నియోజకవర్గంలో లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభించినట్లు శాసన సభ్యులు హన్మంత్ రావు షిండే తెలిపారు. బుధవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో సీసీఐ పత్తి కోనుగోళ్లు పున: ప్రారంభమైన నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పత్తి పంట చేతికి వచ్చిన తరువాత కొనుగోళ్లు జరిగే కాలంలో లాక్ డౌన్ విధించారని రైతులు బాధపడవద్దన్నారు. నియోజకవర్గంలో 16 గ్రామాలలో 9 వేల […]
దిశ, నిజామాబాద్: జుక్కల్ నియోజకవర్గంలో లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభించినట్లు శాసన సభ్యులు హన్మంత్ రావు షిండే తెలిపారు. బుధవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో సీసీఐ పత్తి కోనుగోళ్లు పున: ప్రారంభమైన నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పత్తి పంట చేతికి వచ్చిన తరువాత కొనుగోళ్లు జరిగే కాలంలో లాక్ డౌన్ విధించారని రైతులు బాధపడవద్దన్నారు. నియోజకవర్గంలో 16 గ్రామాలలో 9 వేల క్వింటాళ్ల పత్తి మిగిలిన నేపథ్యంలో దానిని కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో మాట్లాడి తిరిగి కొనుగోళ్లను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పత్తిరైతులు అధైర్యపడొద్దని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.