కాలనీలు జలమయం.. అధికారులపై కార్పొరేటర్ ఆగ్రహం
దిశ, ఎల్బీనగర్: అధికారుల నిర్లక్ష్యం వల్లే డివిజన్ పరిధిలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం డివిజన్ పరిధిలోని బంజారా కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అధికారులకు సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే బంజారా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికే కాలనీల్లోకి వరదనీరు చేరి […]
దిశ, ఎల్బీనగర్: అధికారుల నిర్లక్ష్యం వల్లే డివిజన్ పరిధిలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం డివిజన్ పరిధిలోని బంజారా కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అధికారులకు సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే బంజారా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికే కాలనీల్లోకి వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నాయని అన్నారు. దీంతో ఇళ్లలో నిత్యావసర వస్తువులు, ముఖ్యమైన సామాగ్రి మొత్తం నీళ్లలో తడిసిపోయాయని బంజారా కాలనీవాసులు కార్పొరేటర్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మళ్లీ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని కార్పొరేటర్ అధికారులను ఆదేశించారు.