బలహీనతలు తెలిస్తే.. విరుగుడు ఈజీ
దిశ, వెబ్ డెస్క్: చైనాలో మొదలై ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా(corona) ప్రస్తుతం భారత్‌లో ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా వ్యాక్సిన్ (vaccine) కోసం ఇప్పటికే పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. తాజాగా ఒడిషాకు చెందిన శాస్త్రవేత్తలు(scintests) కరోనా వైరస్ రూపాంతరాల(Variations)పై పరిశోధనలు చేశారు. 73 రకాలుగా వైరస్ రూపాంతరం చేసినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వైరస్ రూపాంతరాలపై సీఎస్ఐఆర్(ICMR), ఐజీఐబీతో పాటుగా భువనేశ్వర్‌లోని ఇన్ స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, ఎస్ఎంయూ ఆసుపత్రి పరిశోధకులు పరిశోధనలు చేశారు. […]
దిశ, వెబ్ డెస్క్: చైనాలో మొదలై ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా(corona) ప్రస్తుతం భారత్‌లో ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా వ్యాక్సిన్ (vaccine) కోసం ఇప్పటికే పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. తాజాగా ఒడిషాకు చెందిన శాస్త్రవేత్తలు(scintests) కరోనా వైరస్ రూపాంతరాల(Variations)పై పరిశోధనలు చేశారు. 73 రకాలుగా వైరస్ రూపాంతరం చేసినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
వైరస్ రూపాంతరాలపై సీఎస్ఐఆర్(ICMR), ఐజీఐబీతో పాటుగా భువనేశ్వర్‌లోని ఇన్ స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, ఎస్ఎంయూ ఆసుపత్రి పరిశోధకులు పరిశోధనలు చేశారు. కరోనా జాతిలో బి 1.112, బి1 అనే రెండు వంశాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్ రూపాంతరాలపై పరిశోధలనకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్(online)లో ఉంచిన్నట్లు డాక్టర్ జయశంకర్ దాస్ వెల్లడించారు. వైరస్ బలహీనతలను తెలుసుకుంటే విరుగుడు(antidote) కనుక్కోవడం సులభతరం అవుతుందని అందన్నారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల సారాంశాన్ని పరిశోధలన డేటాను ఆన్లైన్ లో ఉంచినట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ జయశంకర్ దాస్ తెలిపారు. వైరస్ బలహీనతలను గుర్తిస్తే దానికి విరుగుడు కనుక్కోవడం ఈజీ అవుతుందని అయన తెలిపారు.