ఇప్పటి వరకు 107 మందికి కరోనా: కేంద్రం
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఇప్పటివరకు 107 మంది కరోనా వ్యాధి బారిన పడినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర-31, కేరేళ-22, ఉత్తరప్రదేశ్-11, హరియాణ-14, తెలంగాణ -3 తోపాటు మొత్తం దేశంలో ఇప్పటివరకు 107 కేసులు నమోదయ్యాయని కేంద్రం పేర్కొన్నది. ప్రజలు పలు జాగ్రత్తలు పాటించి కరోనాను కట్టడి చేయాలని తెలిపింది. కరోనా విషయంలో ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని, అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయొద్దని సూచించింది. కరోనాను కట్టడి చేసేందుకు అధికార విపత్తు తరహాలో […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఇప్పటివరకు 107 మంది కరోనా వ్యాధి బారిన పడినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర-31, కేరేళ-22, ఉత్తరప్రదేశ్-11, హరియాణ-14, తెలంగాణ -3 తోపాటు మొత్తం దేశంలో ఇప్పటివరకు 107 కేసులు నమోదయ్యాయని కేంద్రం పేర్కొన్నది. ప్రజలు పలు జాగ్రత్తలు పాటించి కరోనాను కట్టడి చేయాలని తెలిపింది. కరోనా విషయంలో ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని, అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయొద్దని సూచించింది. కరోనాను కట్టడి చేసేందుకు అధికార విపత్తు తరహాలో స్పందించాలని కేంద్రం నిర్ణయించడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. విద్యాసంస్థలు, థియేటర్లు, దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి.
tags : coronavirus, 107, Confirmed cases, notified disaster