కోవిడ్ ఎఫెక్ట్: పాఠశాలలపై సర్కార్ ఫోకస్
పాఠశాల పిల్లల్లో కోవిడ్‌పై అవగాహన పెంచాలని సర్కారు నిర్ణయించింది. పాఠశాలల అసెంబ్లీ సందర్భంగా పిల్లలకు తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి విషయాలు చెప్పడం వల్ల వైరస్ సంక్రమణ వ్యాప్తిని నివారించడంలో సహాయపడుతుందని సర్కారు భావిస్తుంది. ఈ మేరకు అన్ని పాఠశాలల్లో చేతులు కడుక్కోవడానికి అవసరమైన సబ్బులు లేదా శానిటైజర్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఇటువంటి […]
పాఠశాల పిల్లల్లో కోవిడ్‌పై అవగాహన పెంచాలని సర్కారు నిర్ణయించింది. పాఠశాలల అసెంబ్లీ సందర్భంగా పిల్లలకు తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి విషయాలు చెప్పడం వల్ల వైరస్ సంక్రమణ వ్యాప్తిని నివారించడంలో సహాయపడుతుందని సర్కారు భావిస్తుంది. ఈ మేరకు అన్ని పాఠశాలల్లో చేతులు కడుక్కోవడానికి అవసరమైన సబ్బులు లేదా శానిటైజర్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఇటువంటి అంశాలపై వారికి మార్గదర్శకాలు జారీచేస్తారు. విద్యార్థులు పాఠశాల సమయంలో మూడు నాలుగు సార్లు చేతులు కడుక్కోవడానికి అవసరమైన వసతులు కల్పించాలని ఆయన కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే పాఠశాలల నోటీసు బోర్డులలో కూడా కోవిడ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రదర్శించాలని కలెక్టర్లకు సూచించాస్తారు. పాఠశాల తలుపులు తరచుగా డిటర్జెంట్ నీటితో శుభ్రపరచాలని సూచిస్తారు. జ్వరం, జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ సంకేతాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఇబ్బంది పడుతుంటే మూడు రోజులు పాఠశాలకు హాజరుకాకుండా చూసుకోవాలని సర్కారు సూచిస్తుంది. లక్షణాలు తగ్గకపోతే వారు వైద్యుడిని సంప్రదించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు. కోవిడ్ కేసుతో సంబంధం ఉన్న కుటుంబానికి చెందిన పిల్లవాడిని ఇంట్లోనే ఒంటరిగా ఉంచాలని సర్కారు పేర్కొంది.
పుకార్లపై కఠిన చర్యలు..
కోవిడ్ వైరస్‌పై అనవసరపు భయాందోళనలు సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారు పోలీసుశాఖను ఆదేశించనుంది. కలెక్టర్ల సమావేశంలో సీఎస్ ఈ మేరకు ఆదేశాలు ఇస్తారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ తదితర స్థలాల్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రచార మెటీరియల్‌ను వైద్య ఆరోగ్యశాఖ నుంచి మున్సిపల్, పీఆర్, పాఠశాల విద్యాశాఖ, రోడ్లు భవనాలు, పర్యాటకశాఖ, పోలీసు, రవాణామొదలైన వాటికి అందజేయాలని వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎస్ సూచిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖలు అవసరమైతే సొంతంగా మెటీరియల్ తయారు చేయాల్సి ఉంటుంది. కోవిడ్‌పై వీడియో క్లిప్‌లు ప్రతి గంట గంటకు అన్ని టీవీ, లోకల్ కేబుల్ ఛానెల్‌లలో ప్రదర్శించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారు. సినీ ప్రముఖులు, క్రీడాకారుల సాయాన్ని కూడా తీసుకొని ప్రచారం చేయాలి. పర్యాటక శాఖ తన పరిధిలోని హోటళ్లు, రిసార్టులు, లాడ్జీల్లోనూ టూరిస్టుల సమాచారాన్ని సేకరించాలి. దేశవిదేశీ ప్రయాణీకుల వివరాలను సంబంధిత జిల్లాల్లోని వైద్యాధికారులకు తెలియజేయాలి. అన్ని బస్సు డిపోల్లోనూ కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలి. హైదరాబాద్‌లో బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో రైళ్లు, స్టేషన్లు, సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్ వంటి అన్ని బహిరంగ ప్రదేశాలలో హోర్డింగ్‌ల రూపంలో కోవిడ్‌పై ప్రచారం నిర్వహించాలి. రాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయాలి.
tag; carona virus, schools, students, alert