రెండు వారాల్లో కరోనా టీకా?

న్యూఢిల్లీ : దేశంలో తొలి కరోనా వ్యాక్సిన్ అతి త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి స్పష్టమైన సంకేతాలు అందాయి. మరో రెండు వారాల్లో అత్యవసర వినియోగం కోసం కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అనుమతించాలని కోరుతూ డీసీజీఐకు దరఖాస్తు చేసుకోనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అధర్ పునావాలా శనివారం తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ‌ సమావేశానంతరం ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. […]

Update: 2020-11-28 09:46 GMT

న్యూఢిల్లీ : దేశంలో తొలి కరోనా వ్యాక్సిన్ అతి త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి స్పష్టమైన సంకేతాలు అందాయి. మరో రెండు వారాల్లో అత్యవసర వినియోగం కోసం కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అనుమతించాలని కోరుతూ డీసీజీఐకు దరఖాస్తు చేసుకోనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అధర్ పునావాలా శనివారం తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ‌ సమావేశానంతరం ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.

ఎన్ని డోసులు కొనుగోలు చేస్తారనే విషయమై కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని అధర్ పునావాలా పేర్కొన్నారు. కానీ, వచ్చే ఏడాది జూలై వరకు 30 నుంచి 40 కోట్ల డోసులను కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం నెలకు 5 కోట్ల నుంచి 6 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తున్నామని, వచ్చే ఏడాది జనవరి తర్వాత 10కోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. టీకా సమర్థతపై ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలు సరిపోతాయని తెలిపారు. త్వరలో 18ఏండ్ల లోపు వయస్సు వారిపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని చెప్పారు.

Tags:    

Similar News