కరోనా యాక్సెస్‌కు ‘కొత్త ట్రాకర్’

ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్నకరోనా కేసులను గుర్తించేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ కొత్త ట్రాకర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సోమవారం ఆ సంస్థకు చెందిన బింగ్ ఉత్పత్తుల్లో భాగంగా ఈ ట్రాకర్‌ను ఓ వైబ్‌సైట్ రూపంలో అభివృద్ధి చేసినట్టు తెలిపింది. దీనిపై క్లిక్ చేస్తే కరోనా వైరస్ ఏ దేశంలో ఎంత వేగంగా వ్యాప్తిస్తోంది. ఎంత మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్నారు అనే విషయాలను వెల్లడిస్తుంది. ఈ సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నిమరణాలు సంభవించాయి అని తెలుసుకోవచ్చు. వినియోగదారులు ఈ […]

Update: 2020-03-16 09:16 GMT

ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్నకరోనా కేసులను గుర్తించేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ కొత్త ట్రాకర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సోమవారం ఆ సంస్థకు చెందిన బింగ్ ఉత్పత్తుల్లో భాగంగా ఈ ట్రాకర్‌ను ఓ వైబ్‌సైట్ రూపంలో అభివృద్ధి చేసినట్టు తెలిపింది. దీనిపై క్లిక్ చేస్తే కరోనా వైరస్ ఏ దేశంలో ఎంత వేగంగా వ్యాప్తిస్తోంది. ఎంత మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్నారు అనే విషయాలను వెల్లడిస్తుంది. ఈ సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నిమరణాలు సంభవించాయి అని తెలుసుకోవచ్చు. వినియోగదారులు ఈ ట్రాకర్‌ను గూగుల్ క్రోమ్, ఆపిల్ యూజర్స్ అయితే సఫారీ వెబ్ బ్రౌజర్‌ల ద్వారా యాక్సెస్ చేయవచ్చన్నారు.

ఈ ట్రాకర్‌ను పరిశీలించాలనుకుంటే https://www.bing.com/covid సైట్‌పై క్లిక్ చేయాలి. ఇందులో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC), యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ECDC)వంటి వివిధ విశ్వసనీయ వనరుల నుంచి సమాచారం సేకరించి ఇందులో పొందుపరిచారు.

కరోనా వైరస్ ట్రాకింగ్‌కు ఈ వెబ్‌సైట్ చాలా ప్రాథమిక మైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులకు సంబంధించిన వివరాలిస్తుంది. ఏదేనీ ఒక దేశానికి చెందిన కరోనా కేసుల నిర్దిష్ట వివరాలు కావాలనుకుంటే ట్రాకర్ ఆ దేశానికి సంబంధించిన వార్తా కథనాలు, వీడియోలు, గణాంకాలను కూడా వెల్లడిస్తుంది. ఇందులో వ్యక్తుల సమాచారంతో పాటు కరోనా వైరస్ కేసులు నమోదైన రాష్ట్రాల సమాచారాన్ని సైతం విడివిడిగా చూపిస్తుంది.

tags ; corona tracker, us, microsoft, bing products, accurate information world wide cases

Tags:    

Similar News