సిద్ధిపేట జిల్లాలో బ్యాంకు ఉద్యోగికి కరోనా

దిశ, సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా చిన్నాకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చిందని వైద్యులు ధ్రువీకరించారు. అతను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు. గతకొద్ది రోజుల నుంచి అతను కరోనా లక్షణాలతో బాధపడుతూ సిరిసిల్ల దావాఖానకు వెళ్లాడు. అక్కడ వైద్యులు ఆ వ్యక్తి నుంచి శాంపిల్ సేకరించి టెస్టులకు పంపించారు. ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు […]

Update: 2020-07-10 01:30 GMT

దిశ, సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా చిన్నాకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చిందని వైద్యులు ధ్రువీకరించారు. అతను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు. గతకొద్ది రోజుల నుంచి అతను కరోనా లక్షణాలతో బాధపడుతూ సిరిసిల్ల దావాఖానకు వెళ్లాడు. అక్కడ వైద్యులు ఆ వ్యక్తి నుంచి శాంపిల్ సేకరించి టెస్టులకు పంపించారు. ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు రావద్దని ఆ వ్యక్తికి చెప్పి పంపించారు. అయితే ఆ వ్యక్తి ఎల్లారెడ్డిపేటలో ఉండకుండా స్వగ్రామమైన చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి వచ్చి ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నాడు. నేడు ఉదయం సిరిసిల్ల నుంచి వైద్యులు చిన్నకోడూర్ వైద్యులకు సంబంధిత వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి పంపించామని అతనికి కరోనా పాజిటివ్ వచ్చిందని సమాచారాన్ని అందించారు. వెంటనే ఇబ్రహీంనగర్ పి.హెచ్.సి వైద్యులు వారి సిబ్బందితో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లి విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. అదేవిధంగా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుమారుడు సైతం గత మూడు రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి మందులు వేసినప్పటికీ జ్వరం వస్తూ పోతుందని కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు. అతనితోపాటు కుమారుడు, అతడి భార్యను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి తల్లిదండ్రులను హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నేరుగా గ్రామంలోకి వచ్చి హోంక్వారజ్ఞంటైంలోనే ఉన్నాడని వైద్యులు తెలుసుకున్నారు. గ్రామంలో ఎవర్ని ప్రైమరీ కాంటాక్ట్ కాలేదని తెలుసుకున్నారు. గ్రామస్తులందరూ ఇంట్లో నుంచి బయటకు రావద్దని, జాగ్రత్తలు పాటించినప్పటికీ నిర్లక్ష్యం చేయొద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News