వెయ్యి దాటిన కరోనా కేసులు

– కొత్తగా 11 కేసులు- అన్నీ జీహెచ్ఎంసీలోనే దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. గడచిన 24గంటల్లో కొత్తగా 11 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1001కు చేరుకుంది. దేశం మొత్తం మీద ఇప్పటిదాకా వెయ్యి పాజిటివ్ కేసులు దాటిన రాష్ట్రాలు ఎనిమిది ఉన్నాయి. తాజాగా వాటి సరసన తెలంగాణ కూడా చేరింది. ఆదివారం కొత్తగా వచ్చిన కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొమ్మిది మంది […]

Update: 2020-04-26 11:47 GMT

– కొత్తగా 11 కేసులు- అన్నీ జీహెచ్ఎంసీలోనే

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. గడచిన 24గంటల్లో కొత్తగా 11 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1001కు చేరుకుంది. దేశం మొత్తం మీద ఇప్పటిదాకా వెయ్యి పాజిటివ్ కేసులు దాటిన రాష్ట్రాలు ఎనిమిది ఉన్నాయి. తాజాగా వాటి సరసన తెలంగాణ కూడా చేరింది. ఆదివారం కొత్తగా వచ్చిన కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొమ్మిది మంది ఆదివారం డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 316కు చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 660. తాజాగా డిశ్చార్జి అయినవారిలో 75 ఏళ్ళ వృద్ధుడు కూడా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇతను కూడా ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్ళివచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 660 మందిలో సగానికంటే ఎక్కువ మంది జీహెచ్ఎంసీ పరిధిలోని పాజిటివ్ పేషెంట్లే. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ పేషెంట్లు 1001 అయితే అందులో 540 మంది జీహెచ్ఎంసీ పరిధిలోనివారే. సగానికంటే ఎక్కువ మంది జంటనగరాల పరిధిలోనివారే. డిశ్చార్జి అయినవారిలో కూడా 151 మంది వారే ఉన్నారు. మొత్తం పాతిక మంది చనిపోతే అందులో 18 మంది జీహెచ్ఎంసీకి చెందినవారే.

Tags: Telangana, Corona, Positive Cases, Crosses Thousand

Tags:    

Similar News