ఆరు లక్షలు దాటిన కరోనా టెస్టులు

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య ఆరు లక్షల మార్కు దాటింది. గడిచిన 24 గంటల్లో 22,295 టెస్టులు చేయగా అందులో ఇంకా 1,509 శాంపిళ్ళ రిపోర్టులు రావాల్సి ఉంది. తాజాగా 1,982 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో హైదరాబాద్ నగరంలో 463 ఉన్నాయి. రోజురోజుకూ నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది. నగరాన్ని ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రం పరిస్థితి అదుపులోకి రావడం లేదు. రాష్ట్రం మొత్తం […]

Update: 2020-08-09 11:52 GMT

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య ఆరు లక్షల మార్కు దాటింది. గడిచిన 24 గంటల్లో 22,295 టెస్టులు చేయగా అందులో ఇంకా 1,509 శాంపిళ్ళ రిపోర్టులు రావాల్సి ఉంది. తాజాగా 1,982 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో హైదరాబాద్ నగరంలో 463 ఉన్నాయి. రోజురోజుకూ నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది. నగరాన్ని ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రం పరిస్థితి అదుపులోకి రావడం లేదు.

రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకు 79,495 పాజిటివ్ కేసులు నమోదుకాగా 55,999 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 22,869 యాక్టివ్ పాజిటివ్ పేషెంట్లు ఉన్నారని, ఇందులో 16,112 మంది హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారని, మిగిలినవారు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు.

కరోనా కారణంగా తాజాగా పన్నెండు మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 627కు చేరుకుంది.
ఇక తాజాగా నమోదైన పాజిటివ్ కేసులను జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 141, రంగారెడ్డి జిల్లాలో 139, కరీంనగర్‌లో 96, గద్వాలలో 93, జనగాంలో 78, వరంగల్ అర్బన్‌లో 71, పెద్దపల్లిలో 71, కామారెడ్డిలో 62, కొత్తగూడెంలో 64, నల్లగొండలో 59, నిజామాబాద్‌లో 58, సిద్దిపేటలో 55, ఖమ్మంలో 48, నిర్మల్‌లో 47, మహబూబ్‌నగర్‌లో 43, జగిత్యాలలో 42 చొప్పున నమోదయ్యాయి.

Tags:    

Similar News