నిజామాబాద్‌లో ర్యాపిడ్ టెస్టులు
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులను గురువారం నుంచి ప్రారంభించాలని వైధ్య ఆరోగ్యశాఖాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లా జనరల్ ఆస్పత్రిలో కరోనా టెస్టులను నిర్వహిస్తున్నారు. అయితే, రోజుకూ కేవలం 30 పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1799 మందికి టెస్టులు చేయగా, 1,399 మందికి నెగెటివ్ రాగా, 281మందికి పాజిటివ్ వచ్చాయి. ఈ మధ్యకాలంలో జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో జులై16 (గురువారం) నుంచి ర్యాపిడ్ పరీక్షలు చేయాలని […]
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులను గురువారం నుంచి ప్రారంభించాలని వైధ్య ఆరోగ్యశాఖాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లా జనరల్ ఆస్పత్రిలో కరోనా టెస్టులను నిర్వహిస్తున్నారు. అయితే, రోజుకూ కేవలం 30 పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1799 మందికి టెస్టులు చేయగా, 1,399 మందికి నెగెటివ్ రాగా, 281మందికి పాజిటివ్ వచ్చాయి.
ఈ మధ్యకాలంలో జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో జులై16 (గురువారం) నుంచి ర్యాపిడ్ పరీక్షలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.ఈ నేపథ్యంలోనే నిజామాబాద్‌లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 2,800 కిట్ల ద్వారా టెస్టులు చేయాలనుకుంటున్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నిషియన్లకు అవగాహన కూడా కల్పించారు. ప్రస్తుతం వీరి కొరత ఉన్నప్పటికి దానిని అధిగమించి టెస్టుల నిర్వహణ చేపట్టనున్నారు. ముందుగా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారికి తొలి ప్రాధన్యత ఇవ్వనున్నారు. అలాగే, కరోనా లక్షణాలు ఉన్నవారికి కుడా పరీక్షలు చేయనున్నట్లు తెలుస్తోంది.