వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా..
దిశ, వెబ్ డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో తాటికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. వైరస్ సోకినప్పటికీ ఆమె తగిన వైద్యం తీసుకోకపోవడంతో ఊపిరితిత్తుల సమస్య తీవ్రంగా మారింది. దీంతో ఆమెను హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స చేస్తున్నారు. […]
దిశ, వెబ్ డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో తాటికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. వైరస్ సోకినప్పటికీ ఆమె తగిన వైద్యం తీసుకోకపోవడంతో ఊపిరితిత్తుల సమస్య తీవ్రంగా మారింది. దీంతో ఆమెను హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స చేస్తున్నారు. శ్రీదేవి ఆరోగ్యంపై ఏపీ సీఎంవో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.