యూపీ క్యాబినెట్ మినిస్టర్‌కు కరోనా

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర ప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్ బ్రజేష్ పాఠక్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ట్వీట్ చేశారు. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యుల సలహా మేరకు టెస్టు చేయించుకున్నారని, తనతో సన్నిహితంగా మెలిగిన వారూ క్వారంటైన్‌లోకి వెళ్లి టెస్టులు చేయిచుకోవాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి కోరారు. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నలుగురు క్యాబినెట్ మంత్రులకు కరోనా సోకినట్టయింది. బ్రజేష్ పాఠక్‌కు ముందు ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్, జల శక్తి మంత్రి మహేంద్ర […]

Update: 2020-08-06 06:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర ప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్ బ్రజేష్ పాఠక్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ట్వీట్ చేశారు. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యుల సలహా మేరకు టెస్టు చేయించుకున్నారని, తనతో సన్నిహితంగా మెలిగిన వారూ క్వారంటైన్‌లోకి వెళ్లి టెస్టులు చేయిచుకోవాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి కోరారు.

మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నలుగురు క్యాబినెట్ మంత్రులకు కరోనా సోకినట్టయింది. బ్రజేష్ పాఠక్‌కు ముందు ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్, జల శక్తి మంత్రి మహేంద్ర సింగ్‌లకు వైరస్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమల్ రాణి వరుణ్ వైరస్‌తో ఆదివారం కన్నుమూశారు. వీరితోపాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్‌కూ కరోనా సోకింది.

Tags:    

Similar News