రైల్ నిలయంలో 30 మందికి కరోనా..!

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. సామాన్య ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరినీ వదలడం లేదు. తాజాగా సికింద్రాబాద్ రైల్ నిలయంలో 30 మంది రైల్వే ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో సంబంధిత ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. సికింద్రాబాద్ రైల్ నిలయంలో పలు విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 2,500 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 30 మందికి పాజిటివ్ తేలింది. దీంతో ఉన్నతాధికారులు రెండురోజుల పాటు కార్యాలయాన్ని […]

Update: 2020-09-14 10:43 GMT

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. సామాన్య ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరినీ వదలడం లేదు. తాజాగా సికింద్రాబాద్ రైల్ నిలయంలో 30 మంది రైల్వే ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో సంబంధిత ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

సికింద్రాబాద్ రైల్ నిలయంలో పలు విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 2,500 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 30 మందికి పాజిటివ్ తేలింది. దీంతో ఉన్నతాధికారులు రెండురోజుల పాటు కార్యాలయాన్ని మూసివేసి శానిటైజేషన్ నిర్ణయించారు. అనంతరం బుధవారం రైల్ నిలయంలో కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read Also…

హెచ్ ఆర్సీలో సినీ నటుడు శివ బాలాజీ ఫిర్యాదు

Full View

Tags:    

Similar News