రేపే పెళ్లి.. వరుడికి కరోనా.. వధువు ఏం చేసిందంటే..
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ కారణంగా మానవ జీవితంలో పెను మార్పులు జరుగుతున్నాయి. ఒకప్పుడు పెళ్లి అంటే ఎంతో సందడి ఉండేది. కానీ కరోనా వచ్చాక పెళ్లి అయ్యే వరకు రెండు కుటుంబాల్లో టెన్షన్ నెలకొంటోంది. గతేడాది కరోనా కారణంగా ఆన్‌లైన్ వివాహాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా మరోసారి ఆన్‌లైన్ వివాహం జరిగింది. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని అల్మోడా జిల్లాలోని జయంతి మండలంలోని ల్వాలి గ్రామానికి చెందిన ఉమేశ్ సింగ్‌కి.. కాందే […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ కారణంగా మానవ జీవితంలో పెను మార్పులు జరుగుతున్నాయి. ఒకప్పుడు పెళ్లి అంటే ఎంతో సందడి ఉండేది. కానీ కరోనా వచ్చాక పెళ్లి అయ్యే వరకు రెండు కుటుంబాల్లో టెన్షన్ నెలకొంటోంది. గతేడాది కరోనా కారణంగా ఆన్‌లైన్ వివాహాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా మరోసారి ఆన్‌లైన్ వివాహం జరిగింది. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని అల్మోడా జిల్లాలోని జయంతి మండలంలోని ల్వాలి గ్రామానికి చెందిన ఉమేశ్ సింగ్‌కి.. కాందే గ్రామానికి చెందిన మంజు కన్యాల్‌తో పెళ్లి నిశ్చయమైంది.
అయితే, ప్రస్తుతం వరుడు ఉమేశ్ సింగ్ యూపీలోని లక్నోలో ఉంటున్నాడు. పెళ్లి సందర్భంగా ఎందుకైనా మంచిదని ఉమేశ్ కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. టెస్టులో అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇదే సమయంలో ఉమేశ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యుల్లో కూడా కొందరు వైరస్ బారిన పడ్డారు. కరోనా టెస్టుల అనంతరం ఈనెల 23న వరుడికి కరోనా పాజిటివ్ అని తేలగా.. అంతకుముందు రోజే వధూవరుల కుటుంబ సభ్యులు తమ ఇళ్లల్లో గణపతి పూజ నిర్వహించారు. 24వ తేదీన వివాహం జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్.. రెండు కుటుంబాలను టెన్షన్‌కు గురిచేసింది.
అన్నీ అనుకున్న తర్వాత పెళ్లి వాయిదా వేయకూడదని భావించిన ఇరు కుటుంబాలు.. పురోహితులను సంప్రదించి ఆన్‌లైన్ ద్వారా వివాహం చేశారు. అయితే, పెళ్లి సమయంలో వధువు ఉత్తరాఖండ్‌లోని కాందే గ్రామంలో ఉండగా.. వరుడు ఉమేశ్ లక్నోలో ఉన్నాడు. చివరకు ఆన్‌లైన్‌లో పెళ్లి తంతు కానివ్వడంతో రెండు కుటుంబాల సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.