కరోనా పేషంట్ల అడ్రస్ గల్లంతు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తితో జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే సమయంలో కరోనా పేషంట్ల మిస్సింగ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లాలో దాదాపు 200 మంది పేషంట్ల అడ్రస్ గల్లంతు అయింది. ఈ వ్యవహారం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల కరోనా లక్షణాలు ఉండి టెస్టులు చేయించుకున్న పలువురికి పాజిటివ్ అని తేలింది. అయితే, హోం ఐసోలేషన్ ఉండాలని వైద్యాధికారులు సూచించారు. అలాగే, బాధితుల నుంచి […]

Update: 2020-08-07 04:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తితో జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే సమయంలో కరోనా పేషంట్ల మిస్సింగ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లాలో దాదాపు 200 మంది పేషంట్ల అడ్రస్ గల్లంతు అయింది. ఈ వ్యవహారం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.

ఇటీవల కరోనా లక్షణాలు ఉండి టెస్టులు చేయించుకున్న పలువురికి పాజిటివ్ అని తేలింది. అయితే, హోం ఐసోలేషన్ ఉండాలని వైద్యాధికారులు సూచించారు. అలాగే, బాధితుల నుంచి అడ్రస్, తదితర వివరాలను అధికారులు సేకరించారు. ఆ తర్వాత వారిచ్చిన చిరునామాకు వెళ్లి చూస్తే పేషంట్లు కనిపించడం లేదు. దీంతో ఆందోళన చెందిన వైద్యాధికారులను పోలీసులను ఆశ్రయించారు. కరోనా పేషంట్ల అడ్రస్ గల్లంతు వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News