ఈ ఐసోలేషన్ వార్డు.. వెరీ డర్టీ

హైదరాబాద్‌లోని కోరంటి ఫీవర్ హాస్పిటల్‌లో ఐసోలేషన్ వార్డు చాలా మురికిగా ఉందని, అందులో ఉండటం కంటే చావడం మేలని కరోనా పాజిటివ్ బాధితురాలు ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో స్పందించిన అధికారులు ఆమెను చెస్ట్ హాస్పిటల్‌లోని మరో వార్డుకు షిఫ్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..విదేశాల నుంచి వచ్చిన ఓ మహిళకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెను ఫీవర్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే […]

Update: 2020-03-26 08:59 GMT

హైదరాబాద్‌లోని కోరంటి ఫీవర్ హాస్పిటల్‌లో ఐసోలేషన్ వార్డు చాలా మురికిగా ఉందని, అందులో ఉండటం కంటే చావడం మేలని కరోనా పాజిటివ్ బాధితురాలు ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో స్పందించిన అధికారులు ఆమెను చెస్ట్ హాస్పిటల్‌లోని మరో వార్డుకు షిఫ్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..విదేశాల నుంచి వచ్చిన ఓ మహిళకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెను ఫీవర్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే అక్కడంతా మురికిగా, వాసన వెదజల్లడం, కనీస సౌకర్యాలు లేవని, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె వీడియో తీసి పోస్టు చేసింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెల్లడంతో వారు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే అసలే ప్రాణాంతక వైరస్ బాధపడుతున్న వారిని అలాంటి చోట ఉంచుతారా అని పలువురు విమర్శిస్తున్నారు.

Tags : hyd, corona, isolation ward very dirty, video on social media,fever hospital

Tags:    

Similar News