ల్యాబ్‌లోనే కరోనా పుట్టుక : యాన్

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది కేసులు, లక్షలాది మరణాలకు కారణమైనా కరోనా వైరస్‌ను ల్యాబ్‌లోనే తయారు చేశారని చైనాకు చెందిన వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ అన్నారు. కరోనా వెలుగులోకి వచ్చిన కొత్తలోనే ఆమెను చంపేందుకు కుట్ర జరగగా చైనా నుంచి పారిపోయి విదేశాల్లో తలదాచుకుంటోంది. తాజాగా మరోసారి ఆ కుట్ర వెనుక దాగిన నిజాలను బయటపెడుతానని లీ మెంగ్ యాన్ వెల్లడించారు. బ్రిటన్ కు చెందిన ఓ టాక్ షోలో మాట్లాడిన ఆమె.. ‘కరోనాను ల్యాబ్‌లోనే […]

Update: 2020-09-13 03:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది కేసులు, లక్షలాది మరణాలకు కారణమైనా కరోనా వైరస్‌ను ల్యాబ్‌లోనే తయారు చేశారని చైనాకు చెందిన వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ అన్నారు. కరోనా వెలుగులోకి వచ్చిన కొత్తలోనే ఆమెను చంపేందుకు కుట్ర జరగగా చైనా నుంచి పారిపోయి విదేశాల్లో తలదాచుకుంటోంది. తాజాగా మరోసారి ఆ కుట్ర వెనుక దాగిన నిజాలను బయటపెడుతానని లీ మెంగ్ యాన్ వెల్లడించారు.

బ్రిటన్ కు చెందిన ఓ టాక్ షోలో మాట్లాడిన ఆమె.. ‘కరోనాను ల్యాబ్‌లోనే తయారు చేశారని, ఈ విషయం చైనా, WHOకు ముందే తెలుసునని’ పేర్కొన్నారు. రెండు విభిన్న వైరస్‌లను కలిపి కరోనాను ఎప్పుడో సృష్టించారని.. ప్రజలకు మాత్రం గతేడాదే పరిచయం చేశారని లీ మెంగ్ తెలిపారు.

Read Also…

కొవిడ్ వచ్చి నయమైతే మళ్లీ రాదా?

Full View

Tags:    

Similar News