కరోనా.. గుండెకు చేటు.. దెబ్బతింటున్న హృదయ కండరాలు

దిశ వెబ్ డెస్క్: ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్లు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వాళ్లు, పెద్దలు, చిన్నారులు కోవిడ్ బారిన పడితే ప్రమాదమని ఇప్పటికే డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్న వాళ్లకు కూడా ముప్పు అధికంగా ఉంటుందని వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. ఎటువంటి హృదయ సంబంధ సమస్యల లేకపోయినా కరోనా వైరస్ సోకిన తర్వాత గుండెకు ముప్పు ఏర్పడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అలాగే, హృదయ సంబంధ […]

Update: 2020-03-30 05:49 GMT

దిశ వెబ్ డెస్క్: ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్లు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వాళ్లు, పెద్దలు, చిన్నారులు కోవిడ్ బారిన పడితే ప్రమాదమని ఇప్పటికే డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్న వాళ్లకు కూడా ముప్పు అధికంగా ఉంటుందని వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. ఎటువంటి హృదయ సంబంధ సమస్యల లేకపోయినా కరోనా వైరస్ సోకిన తర్వాత గుండెకు ముప్పు ఏర్పడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అలాగే, హృదయ సంబంధ సమస్యలున్నవారికి ప్రాణాంతకంగా మారుతుందని హ్యూస్టన్‌లోని టెక్సాస్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ సెంటర్ అధ్యయనంలో తేలింది. హృదయంపై కరోనా ప్రభావాన్ని ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని టెక్సాస్ విశ్వవిద్యాలయ వైద్య శాస్ర్త పరిశోధకులు తెలిపారు.

ఇంతకుముందు ఎలాంటి గుండె సంబంధ సమస్యలు లేకపోయినా కరోనా వైరస్ సోకిన తర్వాత హృదయ కండరాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, అప్పటికే గుండె వ్యాధులు ఉన్న వారిలో ప్రమాద స్థాయి తీవ్రంగా ఉంటోందని పరిశోధనలో పాల్గొన్న టెక్సాస్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మొహమూద్ మజీద్ వ్యాఖ్యానించారు. అంతేకాదు కరోనా వైరస్ సోకడం వల్ల కొన్ని సార్లు గుండె విఫలమవుతోందని తెలిపారు.

ఆరుపదులు దాటితే..

గుండె జబ్బులు, హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న 65 ఏల్ల పైబడ్డ రోగులకు దాదాపు క్రిటికల్ కేర్ అవసరం అవుతోందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ బులెటిన్ విడుదల చేసిందని ఆ బృందం గుర్తుచేస్తోంది.. వైరస్, ఇన్‌ఫ్లూయాంజా లాంటి అంటువ్యాధులు సోకితే తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల , గుండె వైఫల్యానికి దారితీస్తాయని పరిశోధన బృందం వివరించింది. అమెరికా కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వెల్లడించిన ప్రకారం.. కోవిడ్-19 మృతుల్లో కార్డియోవాస్క్యూలర్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి మరణాల రేటు 10.5 శాతమని తెలిపారు.

tags : coronavirus, heart disease, cardiovascular, heart problems,

Tags:    

Similar News