ఖమ్మంలో కరోనా కిట్లు మాయం..?

దిశ‌ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో కరోనా కిట్లు మాయమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కేంద్రంలో మాయమైన కిట్ల వెనుక ఆస్పత్రి సిబ్బంది చేతివాటం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొందరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ.. ఆస్పత్రికి వచ్చిన వారితో సొమ్మును తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. ఓ వైపు కరోనా కిట్లు మాయం కావడం.. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షకు వచ్చే వారి నుంచి మధ్యవర్తులు దోచుకుంటున్నా వైద్యారోగ్య […]

Update: 2020-09-09 07:38 GMT
ఖమ్మంలో కరోనా కిట్లు మాయం..?
  • whatsapp icon

దిశ‌ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో కరోనా కిట్లు మాయమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కేంద్రంలో మాయమైన కిట్ల వెనుక ఆస్పత్రి సిబ్బంది చేతివాటం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొందరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ.. ఆస్పత్రికి వచ్చిన వారితో సొమ్మును తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.

ఓ వైపు కరోనా కిట్లు మాయం కావడం.. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షకు వచ్చే వారి నుంచి మధ్యవర్తులు దోచుకుంటున్నా వైద్యారోగ్య శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా పరీక్షా కేంద్రంలో జరుగుతున్న మధ్యవర్తులు, అధికారుల చేతివాటంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News