నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం

దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఎంతోమంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించింది. సరిగ్గా ఆరేళ్లు పూర్తయ్యాయి. అయితే.. ఈ ఏడాది కొవిడ్-19 ప్రభావం తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలపై పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రావతరణ వేడుకలను నిరాడంబరంగా జరపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించడం, అనంతరం […]

Update: 2020-06-01 20:36 GMT
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఎంతోమంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించింది. సరిగ్గా ఆరేళ్లు పూర్తయ్యాయి. అయితే.. ఈ ఏడాది కొవిడ్-19 ప్రభావం తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలపై పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రావతరణ వేడుకలను నిరాడంబరంగా జరపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించడం, అనంతరం జాతీయ పతాకావిష్కరణ జరపడం మాత్రమే నిర్వంహిచనున్నారు. సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి లేదు. నేడు సీఎం కేసీఆర్ ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి, అనంతరం ప్రగతి భవన్ లో పతాకావిష్కరణ చేయనున్నారు. ఇక మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ తమ కార్యాలయాల్లోనే మాత్రమే జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. అటు, అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ముందుగా అమరవీరులకు నివాళి అర్పించి, అనంతరం పతాకావిష్కరణ చేయనున్నారు.

Tags:    

Similar News